కేటీఆర్ పట్టాభిషేకం అప్పుడేనట ?
ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్‌కు పట్టాభిషేకం హాట్ టాపిక్‌గా మారింది. కేటీఆర్‌ను సీఎంను చేయాలనే డిమాండ్ అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంది.. ఈ మధ్య కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం కూడా పెట్టేశారనే వార్తలు హల్చల్ చేచస్తున్నాయి... మరి గులాబీ బాస్ మదిలో ఏముందో తెలియదు కానీ.. సీనియర్ మంత్రులు సైతం.. కేటీఆర్‌కు జై కొడుతున్నారు.. ఇక, ఎమ్మెల్యేల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు.. సందర్భం వచ్చినప్పుడల్లా.. కేటీఆరే సీఎం కావాలంటూ తమ మనసులోని మాటలను బయటపెడుతున్నారు. మధ్యలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే ఈ అంశంపై స్పష్టత ఇవ్వడంతో అంతా నెమ్మదించారు. మరి.. ఇప్పుడు ఎలాంటి సంకేతాలు వెళ్లాయో ఏమో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కేటీఆర్ సీఎం అనే నినాదాన్ని బలంగా ఎత్తుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలు కేటీఆర్ సభా నాయకత్వాన జరగాలని కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే షకీల్. కేటీఆర్‌ను సీఎంను చేసేయాలని మంత్రి ఈటల రాజేందర్, సీనియర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ తదిరులు సైతం వంత పాడుతున్నారు.
అయితే.. కేటీఆర్ సీఎం కాబోతున్నాడంటూ... వస్తున్న వార్తలపై సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాని గురించి తనకు తెలియదని.. ఇంట్లో ఉన్నప్పుడు నాన్న, తాతయ్య రాజకీయాల గురించి అసలు చర్చించరని క్లారిటీ ఇచ్చాడు హిమాన్షు. తాజాగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌కు కంగ్రాట్స్ అంటూ ఆయన సమక్షంలోనే పద్మారావు పేర్కొన్నారు. దీంతో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్లోనూ ఫుల్ జోష్ వచ్చింది. అయితే.. సీఎం మార్పు అతి త్వరలోనే ఉండచ్చని పార్టీలో టాక్ నడుస్తోంది. కేటీఆర్‌కు సీఎం పగ్గాలు అప్పగించాక.... కేసీఆర్ కొంత కాలం విశ్రాంతి తీసుకుని.. ఆ తర్వాత జాతీయ రాజకీయాల వైపు అడుగులేసే అవకాశాలున్నాయి. అయితే... జాతీయ రాజకీయాల్లో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ కూటమిని ఏర్పాటు చేసే యోచనలో భాగంగానే సీఎం కేసీఆర్ అడుగులు వేయనున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏదీ ఏమైనా దీనిపై అతి త్వరలోనే క్లారిటీ రానుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)