కేటీఆర్ కు మరో అంతర్జాతీయ ఆహ్వానం

కేటీఆర్ కు మరో అంతర్జాతీయ ఆహ్వానం

రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం తమ దేశంలో పర్యటించాలని కోరుతూ ప్రత్యేక ఆహ్వానం పంపింది. స్వయంగా యూఏఈ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ లేఖ రాశారు. తెలంగాణలో పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అతిథ్యాన్ని అరబ్ ఎమిరేట్స్ మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తన దృష్టికి తీసుకొచ్చిన పలు కీలకమైన అంశాల్లో తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని అరబ్ ఎమిరేట్స్ మంత్రి మరోసారి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం వ్యాపార వాణిజ్యాలతోపాటు గల్ఫ్ కార్మికుల అంశాలను కూడా యూఏఈ మంత్రి దృష్టికి తీసుకెళ్లిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.