పార్టీల అధ్యక్షులకు కేంద్ర మంత్రి లేఖ

పార్టీల అధ్యక్షులకు కేంద్ర మంత్రి లేఖ

దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద జోషి లేఖ రాశారు. ఈనెల 19వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తున్న అన్ని పార్టీల అధ్యక్షుల సమావేశానికి హాజరుకావాలని లేఖలో కోరారు. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారని తెలిపారు. 
దేశంలో అన్ని చట్ట సభలకు ఒకేసారి ఎన్నికలు, 'ఆస్పిరేషనల్‌ డిస్ట్రిక్ట్స్‌' అభివృద్ధి, 75వ స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో 'నవభారత నిర్మాణం', పార్లమెంట్ సమావేశాలు మరింత ఫలవంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకున్న మార్గాలు,  మహాత్మ గాంధీ 150వ జయంతి ఉత్సవాల నిర్వహణ తదితర అంశాలపై ఈ భేటీలో చర్చిస్తామని ప్రహ్లాదజోషి చెప్పారు. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు కూడా లేఖ అందింది.