మామూళ్ల కోసం తెలంగాణ మంత్రి బెదిరింపులు.. వార్నింగ్‌ వైరల్..!

మామూళ్ల కోసం తెలంగాణ మంత్రి బెదిరింపులు.. వార్నింగ్‌ వైరల్..!

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తీరే వేరు ఇప్పటికే పలు వివాదాల్లో ఆయన తలదూర్చినట్టు కొన్ని ఘటలు వెలుగుచూశాయి.. తమ స్థలాన్ని కబ్జా చేశారు.. గతంలో మంత్రి, ఆయన మనుషులపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది.. ఇక, చిన్నా చితక వివాదాల్లో ఆయన పేరు పలు సందర్భాల్లో బయటకు వచ్చింది. తాజాగా.. ఓ రియల్టర్‌ను మంత్రి మల్లారెడ్డి బెదిరించిన ఓ ఆడియో టేప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని మంత్రి మల్లారెడ్డి బెదిరించి ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. తన వాటా సంగతి ఏంటి? అంటూ మంత్రి మల్లారెడ్డి బెదిరింపులకు గురి చేస్తున్న ఆడియో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది.. 

వెంచర్ వేసినందకు తనకు మామూళ్లు ఎందుకు ఇవ్వలేదు? అంటూ రియల్టర్‌ను ప్రశ్నించారు మంత్రి మల్లారెడ్డి.. అయితే తాను సర్పంచ్‌కు మామూళ్లు ఇచ్చానని చెప్పాడు రియల్టర్.. సర్పంచ్‌కు ఇస్తే సరిపోదని.. ఎమ్మెల్యేకు, తనకు కూడా మామూళ్లు ఇవ్వాల్సిందేనని బెదిరింపులకు దిగారు.. అంతేకాదు.. మామూళ్లు ఇచ్చేవరకు వెంచర్ ఆపేయాల్సిందేనంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి.. 50 ఎకరాల్లో వెంచర్ నడుస్తోంది.. దానికి సర్పంచ్‌కు ఇచ్చి పనిచేసుకుంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు. వాడి గురించి కలెక్టర్‌కు చెప్పి పొట్టుపొట్టు చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.. ఇప్పుడు ఈ ఆడియో మీడియా, సోషల్ మీడియాలో వైరల్‌ అయిపోయింది.. మంత్రి మాటలను వినేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి...