మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన చేశారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ మంత్రి మహేందర్ రెడ్డి పేరు ప్రకటించారు. ఆయన భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మాజీ మంత్రి, తాండూరు నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిచెందిన పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ల ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఎంపీగా ఆయన విజయం దాదాపు ఖాయమని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ తరపున చేవెళ్ల ఎంపీగా ఎన్నికైన కొండా విశ్వేశ్వర్ రెడ్డి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి మోసం చేశారని మంత్రి ఆరోపించారు. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ భవిష్యత్ ఇచ్చిన టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారని గుర్తుచేశారు. చేవెళ్ల ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో మహేందర్ రెడ్డిని గెలిపించి మరోసారి  టీఆర్ఎస్ పక్షాన నిలవాలని మల్లా రెడ్డి పిలుపునిచ్చారు.