లులు కంపెనీతో అగ్రిమెంట్ రద్దు...అందుకేనట !

లులు కంపెనీతో అగ్రిమెంట్ రద్దు...అందుకేనట !

వెయ్యి కోట్ల పెట్టుబడితో అనంతపురం జిల్లాలో ఎలక్ట్రిక్‌ బస్సుల ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. 120 ఎకరాల్లో ఎలక్ట్రిక్ బస్సులను ఉత్పత్తి చేసే వీరా కంపెనీ ఏర్పాటు కాబోతోందని, ఏడాదికి 3వేల బస్సుల ఉత్పత్తి సామర్ధ్యంతో కంపెనీ ఏర్పాటవుతోందని ప్రకటించారు మంత్రి. విశాఖలో లులు గ్రూపుకు కేటాయించిన భూమిపై న్యాయ వివాదం నడుస్తోందని, అటువంటి భూమిని గత ప్రభుత్వం సంస్థకు కేటాయించిందని మండిపడ్డారు గౌతమ్ రెడ్డి. విశాఖలో లులు గ్రూప్‌కి టీడీపీ ప్రభుత్వం కేటాయించిన 13 ఎకరాల భూమి ఒప్పందాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ భూమి వివాదంలో ఉందని గౌతమ్ రెడ్డి చెప్పారు. మరోవైపు ఆ సంస్థకు నెలకు రూ.7.09 కోట్ల అద్దె చొప్పున ఒప్పందం చేసుకుందని, అయితే, అక్కడ అద్దె రూ.50 కోట్ల వరకు వస్తుందని చెప్పారు. గత ప్రభుత్వ ఒప్పందాన్ని యధావిధిగా అమలు చేస్తే ప్రభుత్వానికి రూ.500 కోట్లు నష్టం వస్తుందని మేకపాటి చెప్పారు.