రాజధాని నిర్మాణంపై అపోహలు వద్దు..

రాజధాని నిర్మాణంపై అపోహలు వద్దు..

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై అనవసరంగా అపోహలు సృష్టించవద్దని కోరారు మంత్రి మోపిదేవి వెంకటరమణ... గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజధాని నిర్మాణం పేరుతో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులను దొడ్డిదారిన చంద్రబాబు పేరుతో బినామీ అకౌంట్లుకు మళ్లించారని ఆరోపించారు. ఇక, రాజధాని నాసిరకంగా నిర్మాణాలు చేశారని విమర్శించారు మోపిదేవి. మరోవైపు రాష్ట్ర ప్రజానీకం జగన్ పై నమ్మకం పెట్టుకున్నారు.. పాదయాత్రలో హామీలన్నీ జగన్ నేరవేర్చుతారని స్పష్టం చేశారు మోపిదేవి... అవినీతిని ప్రక్షాళన చేస్తూ ప్రభుత్వం నడిపించటం వైఎస్ జగన్‌కే సాధ్యమన్న ఆయన... మిర్చి యార్డ్, పసుపు యార్డులు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తామని వెల్లడించిన మోపిదేవి... దళారి వ్యవస్థను నిర్మూలించేందుకు ధరల స్థిరీకరణ నిధి ఉపయోగపడుతుందన్నారు. ఇక, వైస్ పాలనకు రెట్టింపుగా రైతులు సంతోషంగా ఉండేవిధంగా జగన్ పాలన ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి మోపిదేవి.