మంగళగిరి టికెట్ దొరకడం నా అదృష్టం..

మంగళగిరి టికెట్ దొరకడం నా అదృష్టం..

మంగళగిరి టికెట్ దొరకడం నా అదృష్టం అన్నారు మంత్రి నారా లోకేష్.. మంగళగిరి అభ్యర్థిగా తొలిసారి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన... తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని స్థానిక నేతలని కోరారు. నియోజకవర్గ ఇంచార్జ్‌ గంజి చిరంజీవి ఇంటికి వెళ్లి కలిసి.. ఆయనతో చర్చించి మద్దతు కోరారు మంత్రి లోకేష్. పలువరు స్థానిక నాయకుల ఇళ్లకు స్వయంగా వెళ్లి తనకోసం పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్థానిక నేతలతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. మంగళగిరి టికెట్ దొరకడం నా అదృష్టం అన్నారు. కార్యకర్తలు, నాయకుల అండతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. నాకు కులం, మతం లేవు... అందరి వాడినన్న లోకేష్.. మంగళగిరిని అన్నింటా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే ఐటీ కంపెనీలతో మంగళగిరి అభివృద్ధి చెందిందని గుర్తు చేసిన ఆయన.. ఏ సంఘాలకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగు దేశం అంటేనే బీసీల పార్టీ అన్నారు. ఇక స్థానిక నేత చిరంజీవి భవిష్యత్ పార్టీ చూసుకుంటుందన్నారు మంత్రి నారా లోకేష్.