లోకేశ్‌కు డిజిటల్‌ లీడర్‌ అవార్డు

లోకేశ్‌కు డిజిటల్‌ లీడర్‌ అవార్డు

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్‌కు డిజిటల్‌ లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు లభించింది. ఈ మేరకు బిజినెస్‌ వరల్డ్‌ మ్యాగజైన్‌ ఈ అవార్డును ప్రకటించింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు వినియోగిస్తున్న అధునాతన టెక్నాలజీ, డ్యాష్‌బోర్డు ఆధారంగా ఈ అవార్డులను ప్రకటించారు. అయితే  పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా వంటి వాటి అమలుకు వినియోగిస్తున్న అధునాతన సాంకేతికత, సాధించిన ఫలితాల ఆధారంగా ఈ అవార్డును ప్రకటించింది. ఈనెల 18న ఢిల్లీలోని బిజినెస్‌ వరల్డ్‌ డిజిటల్‌ ఇండియా సమ్మిట్‌లో మంత్రి నారా లోకేశ్‌ ఈ అవార్డును అందుకుంటాడు.