క్రీడాకారులను ప్రోత్సహించిన ఘనత టీడీపీది

క్రీడాకారులను ప్రోత్సహించిన ఘనత టీడీపీది

నెల్లూరు లో అండర్ 14, 17,19 బాలబాలికల జాతీయ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి.64వ జాతీయ బాల్ బ్యాడ్మింటన్ పోటీలను మంత్రులు మంత్రి నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు.16 రాష్ట్రాల నుండి  క్రీడాకారులు పాల్గొంటున్నారు. బాల్ బ్యాడ్మింటన్ లో మొట్టమొదటి అర్జున్ అవార్డు గ్రహీత పిచ్చయ్య ఆంధ్రుడు కావడం గర్వకారణమన్నారు మంత్రులు. పుల్లెల గోపీచంద్, వివిఎస్ లక్ష్మణ్, కోనేరు హంపి, పివి సింధు వంటి అనేక మంది క్రీడాకారులను ప్రోత్సహించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదని, క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు, ఇళ్ల స్థలాలు ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. నూతన రాజధాని అమరావతిలో క్రీడల కోసం ప్రత్యేకంగా ఒక సిటీ నిర్మిస్తున్నామని, అటు మంగళగిరిలోనూ అంతర్జాతీయ స్థాయి స్టేడియం సిద్ధమవుతుందని చెప్పుకొచ్చారు.