రాజధాని నిర్మాణ పురోగతిని త్వరలోనే చూపిస్తాం...

రాజధాని నిర్మాణ పురోగతిని త్వరలోనే చూపిస్తాం...

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిని త్వరలోనే చూపిస్తాం అన్నారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ... రాజధానిలో రోడ్లు, ప్రభుత్వ క్వార్టర్ల నిర్మాణాలను పరిశీలించిన నారాయణ... అన్ని రోడ్లను 2019 మార్చికి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. రాజధానిలో ఓ వైపు అద్భుతమైన నిర్మాణాలు సాగుతుంటే... ఒక్క ఇటుక కూడా పెట్టలేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విమర్శించడం హాస్యాస్పదమని... అత్యాధునిక షీర్ వాల్ టెక్నాలజీలో ఇటుకలు ఉపయోగించామన్న విషయం జగన్‌ తెలుసుకోవాలన్నారు నారాయణ.