ఈపాస్ ద్వారా స్కూళ్లు, హాస్టళ్లకు బియ్యం..!

ఈపాస్ ద్వారా స్కూళ్లు, హాస్టళ్లకు బియ్యం..!

సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పౌరసరఫరాల్లో అవినీతి, అక్రమాలు అడ్డుకట్ట వేశామని తెలిపారు తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి.. పౌరసరఫరాల శాఖ వార్షిక నివేదికను విడుదల చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విత్తన సేకరణ, ప్రజాపంపిణీ విధానంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పౌరసరఫరాలశాఖ చేపట్టిన సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్న మంత్రి... పౌరసరఫరాల శాఖ చేపట్టిన సంస్కరణలను పరిశీలించేందుకు ఇతర రాష్ట్రాలతో పాటు 33 దేశాల ప్రతినిధులు వచ్చినట్టు తెలిపారు. ఇక, ప్రతీ ఏడాది 2.83 కోట్ల లబ్ధిదారులకు 6 కిలోల చొప్పున బియ్యాన్ని అందిజేస్తున్నట్టు వెల్లడించారు మంత్రి  నిరంజన్ రెడ్డి. సరకులను ఈ పాస్ తో పాటు ఐరిస్ ద్వారా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయే నని ప్రకటించారు. అంగన్ వాడీలకు ఈ పాస్ ద్వారా బియ్యం పంపిణీ విజయవంతం కావడంతో పాఠశాలలకు , సంక్షేమ హాస్టళ్లకు ఇదే విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నామని తెలిపారు.