బస్ డిపోలో అగ్నిప్రమాదంపై విచారణ

బస్ డిపోలో అగ్నిప్రమాదంపై విచారణ

అగ్నిప్రమాదం సంభవించిన వరంగల్ -1 డిపోను రవాణా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మ సందర్శించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి దెబ్బ తిన్న రిజర్వేషన్ కౌంటర్, క్యాంటీన్ తో పాటు బస్ స్టాండ్ పరిసరాలను కలియతిరిగారు. ప్రాథమిక సమాచారం మేరకు విద్యుత్ షాక్ సర్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అంచనాకు వచ్చిన మంత్రి పూర్తి విచారణ కోసం ఆదేశించారు. అయితే అగ్నిప్రమాదం తెల్లవారు జామున ప్రయాణికులు లేని సమయంలో జరగడంతో ఎవరికీ ఇబ్బంది కలగలేదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. జరిగిన నష్టం రూ. 20 లక్షలుగా ఉంటుందని మంత్రి అంచనా వేశారు. ఘటన రాత్రి 2.30 గంటల సమయంలో జరిగిందని, ఆ సమయంలో ఎవరున్నారు, ఏంటి అనేది విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, నీట్ సహాయంతో అధ్యయనం చేయిస్తామని చెప్పారు. సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు కష్టపడి పనిచేయడం వల్లే నష్టాలు లేకుండా ముందుకు పోతున్నామన్నారు మంత్రి. ఇక ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మ... బస్ డిజైన్లో లోపాలు జరిగితే సవరిస్తామని చెప్పారు. సీసీ కెమెరాలు లేనందున భద్రతాపరమైన ఇబ్బందులు తప్పటం లేదన్నారు. ప్రమాద ఘటనపై ఫోరెన్సిక్ నిపుణులతో విచారణ జరిపిస్తామని చెప్పారు.