పంచాయతీ నోటిఫికేషన్‌.. కొందరితో కలిసి నిమ్మగడ్డ కుట్ర...!

పంచాయతీ నోటిఫికేషన్‌.. కొందరితో కలిసి నిమ్మగడ్డ కుట్ర...!

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఏపీ రాజకీయాల్లో మరోసారి కాకరేపుతోంది... ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి... సుప్రీంకోర్టులో కేసు ఉండగా.. వ్యాక్సినేషన్‌ జరుగుతుండగా ఎన్నికల నోటిఫికేషన్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కొందరితో కలిసి కుట్ర చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. చంద్రబాబు చెప్పినట్టుగానే ఎస్‌ఈసీ నడుచుకుంటున్నారంటూ ఆరోపించారు. కరోనాతో ఉద్యోగులు భయపడుతున్నా... వారి విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదని ఫైర్‌ అయ్యారు..