పవన్ కు సిగ్గు అనిపించటం లేదా ?

పవన్ కు సిగ్గు అనిపించటం లేదా ?

మాట మాట్లాడితే తాట తీస్తా, తోలు తీస్తా అని గొప్పలు చెప్పుకునే పవన్ కల్యాణ్ మోడీ , అమిత్‌ షా ల తాట ఎందుకు తీయట్లేదని ప్రశ్నించారు మంత్రి పేర్నినాని. ఢిల్లీకి ఇప్పటికే రెండు సార్లు చక్కర్లు కొట్టిన పవన్ బేషరతుగా బీజేపీతో  చేతులు ఎందుకు కలిపారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ మాట్లాడే మాటలకు విలువేముందని వ్యాఖ్యానించారు మంత్రి. చంద్రబాబుకు  లోకేష్ పై నమ్మకం లేకే పవన్ ను చేరదీస్తున్నారని విమర్శించారు. మంచివాడనిపించేందుకు లోకేష్ కంటే పవనే బెటర్ అప్షన్ అని చంద్రబాబు డిసైడ్ అయ్యారన్నారు పేర్నినాని. అధికారంలోకి ఎవరు వచ్చినా అంతా తన వల్లే అని చెప్పుకోవడం పవన్ కల్యాణ్యకు అలవాటేనన్నారు నాని. కేంద్రంలో మోడీ వచ్చినా, ఏపీలో బాబు వచ్చినా మొన్నటికిమొన్న జగన్ పవర్ లోకి వచ్చినా తన వల్లే అని పవన్ చెప్పుకుంటున్నారని వ్యాఖ్యానించారు పేర్నినాని.

మాట మాట్లాడితే తాట తీస్తా, తోలు తీస్తా అని గొప్పలు చెప్పుకునే పవన్ కల్యాణ్ మోడీ , అమిత్‌ షా ల తాట ఎందుకు తీయట్లేదని ప్రశ్నించారు పేర్ని. ఢిల్లీకి ఇప్పటికే రెండు సార్లు చక్కర్లు కొట్టిన పవన్. బేషరతుగా బీజేపీతో  చేతులు ఎందుకు కలిపారని ప్రశ్నించారు. బీజేపీలో బేషరతుగా చేరామని పవన్ ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారని, కనీసం విశాఖ రైల్వే జోన్ ఆర్డర్ అన్నా తీసుకురావల్సిందని అన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీనీ నానామాటలన్న పవన్ ఇప్పుడెందుకు బీజేపీ ముందు బెండ్ అయ్యారని ప్రశ్నించారు. కేసుల భయమేమైనా పవన్ కు ఉందేమో అని వ్యాఖ్యానించారు. 2014 లో సీట్లు గెలవలేని పవన్ కల్యాణ్ 2024 లో ఏం గెలుస్తారని అన్నారు. అలానే పవన్ కళ్యాణ్ తన పార్టీని ఓఎల్ఎక్స్ వెబ్ సైట్ లో విక్రయానికి పెట్టారని ఆయన విమర్శించారు. వైసీపీ కేవలం ప్రజల మద్దతు, పొత్తు, ఎలయన్స్ తోనే సాగుతుందని చంద్రబాబు కు రాజకీయ చాకచక్యంతోనే పొత్తులు, ఎత్తులు, చిత్తులు అని ఆయన విమర్శించారు.