టీఆర్‌ఎస్‌లో ఎలాంటి వర్గాలు లేవు..

టీఆర్‌ఎస్‌లో ఎలాంటి వర్గాలు లేవు..

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్)లో ఎలాంటి వర్గాలు లేవని స్పష్టం చేశారు.. కేసీఆర్ కేబినెట్‌లో తాజాగా చోటు దక్కించుకున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన... పార్టీలో అందరికీ కేసీఆర్‌ తండ్రిలాంటి వారన్నారు.  ముఖ్యమంత్రిగా విచక్షణాధికారంతో మంత్రి వర్గ విస్తరణ చేశారని చెప్పుకొచ్చిన ఆయన... కేబినెట్ విస్తరణలో ఎవర్నీ తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే ప్రయత్నం చేశారని ప్రశంసించారు. మరోవైపు రవాణాశాఖ, ఆర్టీసీపై మరింత అవగాహన పెంచుకుంటానన్నారు మంత్రి పువ్వాడ... ఆర్టీసీ కార్మికులు సంయమనంతో ఉండాలని సూచించిన ఆయన.. ఆర్టీసీలో సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.