'సచివాలయం' తరలింపుపై సర్కార్‌ కీలక నిర్ణయం

'సచివాలయం' తరలింపుపై సర్కార్‌ కీలక నిర్ణయం

తెలంగాణ సచివాలయంలోని కార్యాలయాలను బూర్గుల రామకృష్ణారావు భవన్‌కే తరలించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. మంత్రి ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ జరిగిన మంత్రి వర్గ ఉపసంఘం భేటీలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. బూర్గుల రామకృష్ణారావు భవన్‌ సరిపోని పక్షంలో ఆదర్శనగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు కొన్ని శాఖల కార్యాలయాలను తరలించాలని నిర్ణయించారు.  రెండు వారాల్లో తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇక.. తెలంగాణలో కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణం నేపథ్యంలో భవనాల స్థితిగతులపై అధ్యయనానికి నలుగురు ఇంజనీర్ ఇన్ చీఫ్‌లతో ప్రభుత్వం ఓ సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది.