విద్యాసంస్థల రి-ఓపెన్ క్లారిటీ ఇచ్చిన మంత్రి సబితా

విద్యాసంస్థల రి-ఓపెన్ క్లారిటీ ఇచ్చిన మంత్రి సబితా

విద్యాసంస్థల రి-ఓపెన్ పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. కరోనా తీవ్రత కొనసాగుతున్న తరుణంలో ఇప్పడిప్పుడే విద్యా సంస్థలు తెరిచే అలోచన లేదని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలల ప్రారంభం, ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ, ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా మార్చి 16 నుంచి పాఠశాలలను మూసివేయడం జరిగిందన్నారు . లాక్‌డౌన్ సమయంలో పరీక్షల నిర్వహణపై కూడా ఆందోళన కూడా నెలకొందని అయితే సీఎం చొరవ తీసుకుని అన్ని తరగతుల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశామన్నారు. పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు పాఠశాలలు తెరుస్తామని స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ఆన్‌లైన్ క్లాసులకు రూపకల్పన చేశామన్నారు. విద్యార్థులందరికీ ఉచితంగా బుక్స్‌ను పంపిణీ చేశామని తెలిపారు.