హైదరాబాద్ కేంద్రంగా కుట్రలు చేస్తున్నారు..

హైదరాబాద్ కేంద్రంగా కుట్రలు చేస్తున్నారు..

తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటుంటే ఆపడం చేతకాని కేసీఆర్.. ఏపీలో వేలుపెడుతున్నారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దుయ్యబట్టారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో పరిపాలన సాగకూడదని కేసీఆర్ కోరుకుంటున్నారని ఆరోపించారు. ఏపీలో పరిపాలన స్తంభించిపోవాలని హైదరాబాద్ కేంద్రంగా కుట్రలు సాగుతున్నాయని మండిపడ్డారు. తాను వ్యవసాయ శాఖలో సమీక్షలు చేస్తే ఆనం వివేకానందకు అభ్యంతరమేంటని ప్రశ్నించారు. కనీస నిబంధనలు కూడా తెలియని ఆనం.. ఆర్థిక మంత్రిగా ఎలా పని చేశారో ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా చేశారు. ఏపీలో ఉన్నది ఆపద్ధర్మ ప్రభుత్వం కాదని, చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదని అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంటే విధానపరమైన నిర్ణయాలు మాత్రమే తీసుకోరాదన్నారు. పాలన చేయొద్దని చెప్పడానికి మీరు ఎవరు? అంటూ వైసీపీ నేతలపై మంత్రి ఫైర్ అయ్యారు. ఈసీ, సీఎస్ కలిసి రాష్ట్రాన్ని పాలించాలని వైసీపీ కోరుకుంటోందన్నారు.