కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ తలసాని 

కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ తలసాని 

కాంగ్రెస్ నేతలపై మంత్రి తలసాని తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. అలీబాబా 40 దొంగలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారని ఎద్దేవా చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అలీబాబా 40 దొంగలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని ఎద్దేవాచేశారు. సీఎం కేసీఆర్ పై విశ్వాసంతోనే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరుతున్నరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ లో కూర్చొని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరని తలసాని మండిపడ్డారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. గతంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోలేదా అని తలసాని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులనుకొనే సాంప్రదాయం కాంగ్రెస్‌దేనని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం కూడా కాంగ్రెస్‌ నేతలకు తెలియదని, టీ-కాంగ్రెస్‌ నేతలు దద్దమ్మల్లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ నేతలకు కర్రు కాల్చి వాతపెట్టిన విషయాన్ని గుర్తించుకోవాలని హితవు పలికారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం నిరాడంబరంగా నిర్వహిస్తామని తెలిపారు. రేపటి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.