కేసీఆర్ తిట్టలేదనే వారి నిరుత్సాహం...

కేసీఆర్ తిట్టలేదనే వారి నిరుత్సాహం...

ప్రగతి నివేదన సభ విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్... సభలో సీఎం కేసీఆర్ తమను ఎక్కువగా తిడతారని కాంగ్రెస్ నేతలు ఆశపడ్డట్టున్నారని... కేసీఆర్ తిట్టలేదని నిరుత్సాహ పడ్డారంటూ ఎద్దేవాచేశారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో సాధించిన ప్రగతిని సీఎం విడమరిచి చెప్పారన్న తలసాని... కాంగ్రెస్ నేతలకు దేవుడు బుద్ధిజ్ఞానం ప్రసాదించాలి... వాళ్ల మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ దిక్కు దివానా లేని పార్టీ అంటూ మండిపడ్డ మంత్రి... మిషన్ భగీరథ పై ఉత్తమ్ అబద్దాలు మాట్లాడుతున్నారు... కాంగ్రెస్ నేతలు తమ భాష మార్చుకోవాలి... లేకపోతే కాంగ్రెస్ నేతల కంటే మేం ఎక్కువగా మాట్లాడ గలమని హెచ్చరించారు.  

కేసీఆర్ హటావో అని కాంగ్రెస్ నేతలు బుద్ది లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు తలసాని శ్రీనివాస్ యాదవ్... కేసీఆర్ హటావో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? అని ప్రశ్నించిన ఆయన... నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రగతి నివేదన సభ లాంటి దానిని చూడలేదన్నారు. జనం తండోపతండాలుగా కదలివచ్చారన్న మంత్రి... వేరే పార్టీ వాళ్లు సభలు పెట్టుకుంటే ప్రభుత్వం వద్దంటుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల భాష చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని... కాంగ్రెస్ నేతలకు సభలన్నా భయమే... ముందస్తు ఎన్నికలన్నా భయమే నని సెటైర్లు వేశారు. తెలంగాణలో ప్రజల కోసమే అప్పు చేస్తున్నామని అప్పులపై క్లారిటీ ఇచ్చిన తలసాని... కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అప్పులు చేయడం లేదని ధైర్యంగా చెప్పగలరా? అంటూ నిలదీశారు. తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందా? లేదా? అని కాంగ్రెస్ నేతలు వారి భార్య, పిల్లలను అడిగితే చాలు... వారే చెబుతారంటూ