చేప మందు పంపిణీ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

చేప మందు పంపిణీ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

చేపమందు పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. మంగళవారం సచివాలయంలో చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిసి మంత్రి తలసాని సమీక్ష సమావేశం నిర్వహించారు. జూన్ 8, 9న ఆస్తమా రోగులకు బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. చేప ప్రసాద పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్భంది ఏర్పాట్లు చేపట్టాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. పోలీసు శాఖ అధికారులు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ట్రాఫిక్, బ్యారికేడింగ్, సీసీటీవీల ఏర్పాట్లు చేయాలన్నారు. అగ్నిమాపక నిరోధక వ్యవస్ధకు తగు ప్రాధాన్యం ఇవ్వలన్నారు. అవసరమైన చేప పిల్లలను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. సమావేశంలో జిహెచ్ఎంసి కమీషనర్ దానకిషోర్, నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్, ఫైర్ సర్వీసెస్ డిజి గోపికృష్ణ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మాణిక్ రాజ్, ఫిషరీస్ కమీషనర్ సువర్ణ, బత్తిని హరినాధ్ గౌడ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.