రెండో విడత గొర్రెల పంపిణీకి రెడీ.. ఎప్పటి నుంచి అంటే..?

రెండో విడత గొర్రెల పంపిణీకి రెడీ.. ఎప్పటి నుంచి అంటే..?

కుల వృత్తులకు చేయూతనివ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్... దీని కోసం ఈ నెల 25వ తేదీ నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ  చేయనున్నట్టు తెలిపారు. 25న సూర్యపేట జిల్లా హుజూర్‌నగర్‌లో గొర్రెల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. రూ.5 వేల కోట్లతో 75శాతం రాయితీపై గొర్రెలనుపంపిణీ చేస్తున్నామని... ఒక యూనిట్ విలువ రూ.1.25 లక్షలుగా నిర్ణయించినట్టు వెల్లడించారు. 7,61,895 లబ్ధిదారుల్లో మొదటి విడతలో 3,34619 మందికి గొర్రెలు పంపిణీ చేశామని.. రెండో విడతలో 3,62,047 మందికి గొర్రెలు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు.