నిన్నటి దాకా సింగపూర్‌లో.. ఇప్పుడు మంగళగిరిలో పవన్‌ షూటింగ్..!

నిన్నటి దాకా సింగపూర్‌లో.. ఇప్పుడు మంగళగిరిలో పవన్‌ షూటింగ్..!

రాజధాని ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించడంపై సెటైర్లు వేశారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్... నిన్నటిదాకా సింగపూర్‌లో పవన్ కల్యాణ్ షూటింగ్ చేశారు... ఇప్పుడు మంగళగిరలో షూటింగ్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. అమరావతి తరలిస్తున్నారని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేసిన మంత్రి... అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్నారని క్లారిటీ ఇచ్చారు. భూములిచ్చిన రైతులకు ఎక్కడా అన్యాయం జరగడం లేదన్నారు. ఇక, ఐదేళ్లు రైతులకు అన్యాయం జరిగితే పట్టించుకోని పవన్ కల్యాణ్.. ఇప్పుడు మాపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.