బెజవాడ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇదే..

బెజవాడ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇదే..

ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి విజయవాడలో దుర్గ గుడి ఫ్లైఓవర్‌ పనులను పూర్తి చేస్తామని మంత్రులు ధర్మన కృష్ణదాస్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. నూతన సంవత్సర కానుకగా ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. మంత్రులిద్దరూ ఇవాళ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించారు.  ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ఈ ఫ్లైఓవర్‌పై సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. జగన్ సర్కార్ మాటంటే మాటేనని.. నూతన సంవత్సర కానుకగా ఫ్లైఓవర్ అందిస్తామని వెల్లంపల్లి చెప్పారు. మధ్యలో డిజైన్ మార్చడం తదితర కారణాల వల్ల బడ్జెట్‌ పెరిగిందన్నారు. ప్రాజెక్ట్ కు కేంద్రం నుంచి రూ.10 కోట్లు రావాల్సి ఉందని రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు చెప్పారు.