ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు

ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌గా శంబంగి చిన వెంకట అప్పలనాయుడు బాధ్యతలు స్వీకరించారు.  పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖ్యమంత్రి జగన్‌ తొలుత ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత కుప్పం  నుంచి ఎన్నికైన ప్రతిపక్షనేత చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అనంతరం అక్షర క్రమంలో మంత్రులు, సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించారు.
అంజాద్‌ బాషా షేక్‌ బేపారి, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌, పుష్పశ్రీవాణి, నారాయణస్వామి, అనిల్‌కుమార్‌, గౌతంరెడ్డి మేకపాటి, గుమ్మనూరు జయరాం, కురసాల కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి,  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాలగుండ్ల శంకరనారాయణ, బొత్స సత్యనారాయణ,  చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కొడాలి శ్రీ వెంకటేశ్వర్‌రావు,  బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ముత్యంశెట్టి శ్రీనివాసరావు, వెలంపల్లి శ్రీనివాసరావు,  మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేశ్‌, తానేటి వనిత, పేర్ని వెంకట్రామయ్య నాని, పినిపె విశ్వరూప్‌ తదితరులు వరుస క్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు.