బోనాల ఉత్సవాలకు భారీ నిధులు..

బోనాల ఉత్సవాలకు భారీ నిధులు..

తెలంగాణలో బోనాల ఉత్సవాల నిర్వహణకు రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్టు మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చెప్పారు. జంట నగరాల్లో నిర్వహించే ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సచివాలయంలో ఉన్నతాధికారులతో ఇవాళ మంత్రులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ జూలై 4వ తేదీ నుంచి ఆషాడ బోనాలు జరుగుతాయన్నారు. బోనాల సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్, పోలీసు, జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, వైద్య శాఖ, ఆర్‌ అండ్‌ బీ తదితర  శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే వారి కోసం ఆర్టీస ప్రత్యేక బస్సులను నడుపుతుందన్నారు.