పనులన్నీ చక్కబెట్టుకుని వైసీపీలో చేరారు

పనులన్నీ చక్కబెట్టుకుని వైసీపీలో చేరారు

నెల్లూరులో స్వార్థపరుడికి, నిజాయతీపరుడికి ఈ ఎన్నికల్లో పోటీ జరగబోతోందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. ఆదాల వైసీపీలో చేరిన సందర్భంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో మంత్రులు సోమిరెడ్డి, నారాయణ స్థానిక నేతలతో సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. అనంతరం మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ.. ఆదాలకు నెల్లూరు జల్లా టీడీపీ బాధ్యతలను అధిష్టానం అప్పగించిందన్నారు. ఆయన కోరుకున్న నియోజకవర్గాన్నే కేటాయిస్తే, ఆయన పార్టీని వీడారని మండిపడ్డారు. గత ఏడాదిన్నరగా ఆయన తన పనులన్నీ చక్కబెట్టుకుని పార్టీ ఫిరాయిస్తారని ప్రజలు అనుమానిస్తునే ఉన్నారు. వారు అనుకున్నట్లే ఆయన వైసీపీలో చేరారని సోమిరెడ్డి విమర్శించారు. జిల్లాలో టీడీపీకి ఆదరణ బాగాఉందని, వచ్చేఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్ధానాన్ని టీడీపీ గెలుచుకుంటుందని మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు టీడీపీ నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి శనివారం హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అధినేత జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు.