ఏ మంత్రులు ఓడారు.. ఎవరు గెలిచారు.. 

ఏ మంత్రులు ఓడారు.. ఎవరు గెలిచారు.. 

స్పష్టమైన మెజార్టీ సాధించిన టీఆర్‌ఎస్‌.. ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. టీఆర్ఎస్‌ మొత్తం 88 స్థానాల్లో విజయ ఢంకా మోగించగా.. కాంగ్రెస్‌ 19, టీడీపీ 2, బీజేపీ 1, ఎంఐఎం 7, ఇతరులు రెండు చోట్ల గెలుపొందారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీష్‌ రావు, కేటీఆర్‌, తలసాని సహా పలువురు మంత్రులు ఘన విజయం సాధించారు. ఐతే.. నలుగురు మంత్రులు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గెలిచిన, ఓడిన మంత్రుల వివరాలు..

 • కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు- గెలుపు (గజ్వేల్‌) 
 • ఈటల రాజేందర్‌- గెలుపు (హుజూరాబాద్‌)
 • హరీష్‌ రావు- గెలుపు (సిద్ధిపేట)
 • జగదీష్‌ రెడ్డి- గెలుపు (సూర్యాపేట)
 • జోగు రామన్న- గెలుపు (ఆదిలాబాద్‌)
 • కేటీఆర్‌- గెలుపు (సిరిసిల్ల)
 • ఎ.ఇంద్రకరణ్‌ రెడ్డి- గెలుపు (నిర్మల్‌) 
 • తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌- గెలుపు (సనత్‌నగర్‌)
 • పోచారం శ్రీనివాస రెడ్డి- గెలుపు (బాన్సువాడ) 
 • పద్మారావు గౌడ్‌- గెలుపు (సికింద్రాబాద్‌)
 • అజ్మీరా చందూలాల్‌- ఓటమి (ములుగు) 
 • పట్నం మహేందర్‌ రెడ్డి- ఓటమి (తాండూరు)
 • జూపల్లి కృష్ణారావు- ఓటమి (కొల్లాపూర్‌)
 • తుమ్మల నాగేశ్వరరావు- ఓటమి (పాలేరు)