కాంగ్రెస్ పై మండిపడ్డ మంత్రి జగదీష్

కాంగ్రెస్ పై మండిపడ్డ మంత్రి జగదీష్

నల్లగొండ జిల్లా అభివృద్ధి పై తాము చర్చకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. గత పాలకులకు జిల్లా సమస్యలు, శిశు విక్రయాలు కనపడలేదా అని ప్రశ్నించారు. నాగార్జున సాగర్, హుజూర్ నగర్, నల్లగొండ, దేవరకొండ నియోజకవర్గాల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. ఓట్లేసి గెలిపించిన ఓటర్ల గురించి ఒక్కసారైన నోరు విప్పి మాట్లాడారా అంటూ జానారెడ్డిని ప్రశ్నించారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో లాఠీ దెబ్బలు తినకుండా ఏనాడైనా రైతులకు ఎరువులు దొరికాయా అని అన్నారు. తెలంగాణ రైతాంగాన్ని పూర్తిగా ముంచారు. అర్ధరాత్రి గంటా, రెండు గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చి రైతుల చావుకు కారణమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.