వరంగల్ లో దారుణం: మైనర్ విద్యార్థిపై మరో మైనర్ అత్యాచారం... 

వరంగల్ లో దారుణం: మైనర్ విద్యార్థిపై మరో మైనర్ అత్యాచారం... 

దేశంలో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.  అత్యాచారాలు తగ్గించేందుకు ఎన్నిచట్టాలు తీసుకొచ్చినా ఆగడం లేదు.  పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా మార్పు రావడంలేదు.  టెక్నాలజీ ప్రభావం మనిషిపై చాలా వరకు ఉంటోంది.  చదువుకునే రోజుల నుంచి ఆకర్షణో ప్రేమో తెలియక జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.  తెలంగాణలో దిశ ఘటన జరిగిన తరువాత కూడా ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. \

రీసెంట్ గా వరంగల్ లో ఓ సంఘటన జరిగింది.  పాలిటెక్నిక్ చదివే ఓ మైనర్ యువకుడు మరో మైనర్ విద్యార్థితో స్నేహం చేశాడు.  కాలేజీలో స్నేహం అంటే మామూలే.  అయితే, ఈ స్నేహాన్ని అడ్డం పెట్టుకొని సినిమాలకు, పార్కులకు రావాలని కోరేవాడట.  అందుకు ఆ అమ్మాయి తిరస్కరించింది.  ఎలాగైనా ఆ అమ్మాయిని మోసం మోసం చేయాలనీ అనుకున్నాడు.  ఓరోజు ఇంటికి పిలిచాడు.  అమ్మ చూడాలని చెప్పిందని అబద్దం చెప్పాడు.  ఆ విషయం తెలియక సరే అన్నది.  ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.  దీంతో ఆ విద్యార్థిని ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పింది.  పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  ఇద్దరు మైనర్లు కావడంతో మైనర్ చట్టాలతో కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు.