చిత్తూరు జిల్లా కుప్పంలో పరువు హత్య ?

చిత్తూరు జిల్లా కుప్పంలో పరువు హత్య ?

చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలిక అనుమానాస్పద రీతిలో చనిపోయింది. మృతురాలు చందన 5 రోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకుంది. మాట్లాడాలని చెప్పి బాలికను ఇంటికి రప్పించారు బాధితురాలి తల్లిదండ్రులు. తరువాత పొలంలో దహనమై బూడిదగా మిగిలింది చందన. తల్లిదండ్రులే హత్య చేశారంటూ ప్రియుడు నందన్‌ ఫిర్యాదు చేశాడు. అయితే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు చెప్తున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నెల 11వ తేదీన జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెడ్లపల్లె గ్రామానికి చెందిన చందన చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. అదే మండలం బొడ్డుముడి గ్రామానికి చెందిన నందకుమార్‌ అనే యువకుడితో చందనకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఈ నెల 11వ తేదీ, శుక్రవారం ఉదయం చందన ఇంటి నుంచి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయం కుప్పంలోని ఓ ఆలయంలో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు ఆమెను ఇంటికి రప్పించారు. అదే రోజు రాత్రి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో చందన మృతి చెందింది. కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని సమీప పొలంలో దహనం చేశారు. ఈ సంఘటన ఈరోజు వెలుగులోకి వచ్చింది.