'మిస్ ఇండియా'గా కీర్తి సురేష్

'మిస్ ఇండియా'గా కీర్తి సురేష్

అదేంటి ఎప్పుడు కీర్తి సురేష్ మిస్ ఇండియా ఎలా అవుతుందా ? అని తెగ ఆలోచించేయకండి. కీర్తి సురేష్ అవుతోంది రియల్ మిస్ ఇండియా కాదు, రీల్ మిస్ ఇండియా. మ‌హాన‌టి త‌రువాత తెలుగులో మరో సినిమా చేయని కీర్తి సురేష్ మ‌రో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. నరేంద్ర నాద్ అనే నూతన దర్శకుడితో కలిసి ఆమె సినిమా చేస్తోంది. ప్రస్తుతం షూట్ చివరి దశలో ఉన్న ఈ మూవీకి 'మిస్ ఇండియా' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరిగింది. దానికి ముందుగా సఖి అనే టైటిల్ అనుకున్నా మళ్ళీ ఏమనుకున్నారో ఏమో కానీ ఈ సినిమాకి మిస్ ఇండియా అనే టైటిల్ అనుకుంటున్నారని ప్రచారం జరిగింది. తాజాగా అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటింది. మహిళల మీద జరిగే దాడులను ఈ సినిమాలో ప్రధానంగా చూపించనున్నారని టాక్. ఈస్ట్‌కోస్ట్ బ్యానర్‌పై నందమూరి హీరోల పీఆర్వో మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నరేష్, నదియా, రాజేంద్రప్రసాద్, కమల్ కామరాజు, భానుశ్రీ మెహ్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.