జడ్జిగా అందాల సుందరి!

జడ్జిగా అందాల సుందరి!

మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్న మానుషీ చిల్లర్.. ఇప్పుడు 'జడ్జి' అవతారం ఎత్తింది. గతేడాది మిస్‌ ఇండియా వరల్డ్‌ పోటీల్లో ఆకట్టుకుని ఆ తర్వత మిస్‌ వరల్డ్‌ పోటీలకు ఎంపికైన మానుషీ.. ఈసారి అదే పోటీలకు జడ్జిగా వ్యవహరించింది. 'గతేడాది నేను గెలిచిన పోటీల్లో మరోసారి పాల్గొంటున్నాను. కానీ ఈసారి కంటెస్టెంట్‌గా కాదు.. జడ్జిగా' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అవకాశం వస్తే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తానని చెప్పిన ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు హాట్‌ ఫొటో షూట్స్‌తో అలరిస్తోంది.