ఇరవై ఏళ్ల క్రితం మిస్సింగ్..ఇప్పుడు ఫేస్ బుక్ కలిపింది !

ఇరవై ఏళ్ల క్రితం మిస్సింగ్..ఇప్పుడు ఫేస్ బుక్ కలిపింది !

తొమ్మిదేళ్ల వయసులో అదృశ్యమయ్యాడు. రెండు దశాబ్దాల తర్వాత తల్లిదండ్రుల చెంతకు చేరాడు. రీల్ స్టోరీలా అనిపిస్తున్నా ఇది రియల్ స్టోరీ. ఉన్నాడో లేడో అనుకున్న కొడుకు పండుగనాడు తిరిగొచ్చాడు. కుటుంబానికే కాదు మొత్తం ఊరికే... సంక్రాంతికి కొత్త సంతోషాన్ని మోసు కొచ్చాడు. 30ఏళ్ల  జ్ఞాపకాలను పేగు బంధాతంతో ముడిపెట్టిన క్రెడిట్ సోషల్ మీడియా కొట్టేసింది. విశాఖ జిల్లాలో ఈ అపూర్వ ఘటన చోటుచేసుకుంది. విశాఖ జిల్లా అరకు వ్యాలీలో పుట్టిన గంగాధర్ అందరిలాగే చిన్నతనంలో  ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపాడు. కానీ, అనుకోకుండా ఒకరోజు అతని జీవితం కొత్త మలుపు తిరిగింది.  

తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు రైల్లో తప్పిపోయి చెన్నైలో తేలాడు. అక్కడి పోలీసులు అతన్ని ఈ సేవా చక్ర అనాధాశ్రమంలో  చేర్పించారు. అప్పట్లో పత్రికా ప్రకటన ఇచ్చినప్పటికీ ఎవరూ రాకపోవడంతో... గంగాధర్ అని పేరుపెట్టి  ఐటిఐ వరకు చదివించారు.  ప్రస్తుతం గంగాధర్ LICలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. సోషల్ మీడియాలో అరకు గిరిజన మ్యూజియంని చూడడంతో గంగాధర్‌కు గతం కొంత మేర గుర్తుకు వచ్చింది. వెంటనే చెన్నై పోలీసుల సహకారంతో ఏజెన్సీకి తరలి వచ్చాడు. ప్రస్తుతం గంగాధర్‌ను అతని పేరెంట్స్‌కు అప్పగించే పనిలో విశాఖ పోలీసులు ఉన్నారు. తన తల్లిదండ్రులను కలవబోతున్నందుకు ఆ యువకుడు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం గంగాధర్ తల్లి మాత్రమే ఉందని, తండ్రి చనిపోయినట్లు చెబుతున్నారు.