హీరోకు గాయం - రూ.550 కోట్లు అదనపు భారం..!!

హీరోకు గాయం - రూ.550 కోట్లు అదనపు భారం..!!

ముందుగా అనుకున్న ప్రకారం పక్కాగా షూటింగ్ జరగాలి.. ఏ మాత్రం తేడా వచ్చినా.. నిర్మాతకు తడిసి మోపెడు అవుతుంది.  బడ్జెట్ అమాంతం పెరిగిపోతుంది.  ఎలాగో కష్టపడి సినిమా పూర్తిచేస్తారు.  ఆ సినిమా ఆడితే.. డబ్బులు వస్తాయి.. లేదంటే.. నష్టాల అమాంతం పెరిగిపోతాయి.  టాలీవుడ్ లో ఇలాంటి సందర్భాలు బహు అరుదుగా జరుగుతుంటాయి.  ఒకవేళ ఒకటిరెండు ఆలస్యం అయితే పెద్దగా భారం పెరగదు.  కానీ హాలీవుడ్ సినిమాల్లో అలాకాదు.  ఏదైనా తేడా వచ్చి షూటింగ్ ఆగింది అంటే.. భారం భారీ ఎత్తున పెరిగిపోతుంది.  

అలాంటి సంఘటన హాలీవుడ్ లో జరిగింది.  పారామౌంట్ పిశ్చర్స్ నిర్మిస్తున్న మిషన్ ఇంపాసిబుల్ - ఫాలౌట్ సినిమా షూటింగ్ సమయంలో ఓ చిన్న తేడా జరిగింది.  ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న టామ్ క్రూజ్.. ఒక ఇంటిమీద నుంచి మరో ఇంటి మీదకు దూకే సమయంలో కాలికి గాయం అయింది.  ఆ నొప్పిని దిగమింగి.. టామ్ క్రూజ్ మరో షాట్ చేశాడు.  నొప్పి ఎక్కువగా బాధించడంతో.. వైద్యుల సలహా మేరకు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవలసి వచ్చింది.  దీంతో షూటింగ్ ఆగిపోయింది.  మొదట ఈ సినిమాకు రూ.1700 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకున్నారు.  హీరోకు గాయం కావడం వలన షూటింగ్ కొన్నాళ్ళు నిలిపివేయవలసి వచ్చింది.  దీంతో అదనంగా మరో రూ.550 కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి వచ్చింది పారామౌంట్ సంస్థ.  భారీ ఫైట్స్, చేజింగ్స్ తో రూపొందిన ఈ సినిమా జులై 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది.