ఆకాశం అంచున సినిమా చూపించిన టామ్ క్రూజ్ !

ఆకాశం అంచున సినిమా చూపించిన టామ్ క్రూజ్ !

హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ నటించిన కొత్త చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్ - ఫాల్ అవుట్'.  ఇటీవలే ఈ చిత్రం విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తోంది.  హీరో టామ్ క్రూజ్ ఈ చిత్రాన్ని 2000 మంది అభిమానులకు ప్రత్యేక షో వేసి మరీ చూపించారు.  

అయితే ఆ షో జరిగింది నెల మీద కాదు.. 2000 అడుగుల ఎత్తులో.  అవును నార్వేలో ఉన్న 2000 అడుగుల ఎత్తైన ఫుల్పిట్ రాక్ పై ఓపెన్ ఎయిర్ షో ఏర్పాటు చేసాడు టామ్.  అక్కడికి 2000 మంది ప్రేక్షకులు 4 గంటల పాటు హైకింగ్ చేసుకుంటూ వెళ్లి సినిమాను తిలకించారు.  విచిత్రమైన ఈ అనుభూతి పట్ల అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఎంతైనా టామ్ టేస్ట్ డిఫరెంట్ అంటున్నారు.