ఐపీఎల్ లో ఎవరెంత ధర పలుకుతారో చెప్పిన చోప్రా...

ఐపీఎల్ లో ఎవరెంత ధర పలుకుతారో చెప్పిన చోప్రా...

ఐపీఎల్ 2021 వేలం కోసం నిన్న అన్ని జట్లు తమ వెంట ఉంచుకునే ఆటగాళ్ల జాబితాను అలాగే వదిలిపెట్టే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై మాజీ ఆటగాడు ప్రస్తుతం వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా మాట్లాడుతూ... ఈ ఐపీఎల్ వేలంలో ఎవరెంత ధర పలుకుతారో చెప్పాడు. గత ఏడాది ఐపీఎల్ నుండి తప్పుకొని తాజాగా జరిగిన భారత్-అసైన్ సిరీస్ లో అద్భుతమైన బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఈ ఫిబ్రవరిలో జరిగే వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారవచ్చని చోప్రా చెప్పాడు. అలాగే పంజాబ్ విడుదల చేసిన ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ 7 నుంచి 8 కోట్లు మరియు ఢిల్లీ విడిచి పెట్టిన జాసన్ రాయ్ 4-6 కోట్లు పలుకుతారని చోప్రా తెలిపారు. అంతే కానుండా  ఆస్ట్రేలియా క్రికెటర్లు గ్లెన్ మాక్స్వెల్, నాథన్ కౌల్టర్-నైలు, కామెరాన్ లు మంచి ధర పలుకుతారాలి విశ్వసం వ్యక్తం చేసాడు చోప్రా.