మూడో స్థానంలో మిథాలీ రాజ్

మూడో స్థానంలో మిథాలీ రాజ్

భారత కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానం(674)లో కొనగాసాగుతోంది. శ్రీలంకతో సిరీస్‌లో అద్భుతంగా ఆడటంతో వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ సిరీస్ కి ముందు మిథాలీ రాజ్‌ ఏడవ స్థానంలో ఉంది. తాజా ర్యాంకింగ్స్‌లో.. 674 పాయింట్లతో నాలుగు స్థానాలను మెరుగుపరుచుకుని మూడో స్థానంలోకి దూసుకెళ్లింది. ఆసీస్ స్టార్ ప్లేయర్లు ఎలిస్‌ పెనీ(744) మొదటి స్థానంలో.. మెగ్‌ లానింగ్‌ (684) రెండవ స్థానంలో ఉన్నారు. టీమిండియా బ్యాట్స్‌వుమన్‌ స్మృతి మంధానా (672) నాలుగో స్థానంలో కొనసాగుతోంది.