కరోనా మహిళల క్రికెట్ ను 2 ఏళ్ళు వెనక్కి నెట్టింది : మిథాలీ రాజ్

కరోనా మహిళల క్రికెట్ ను 2 ఏళ్ళు వెనక్కి నెట్టింది : మిథాలీ రాజ్

కరోనా విరామం మహిళల క్రికెట్ వృద్ధిని కనీసం రెండేళ్ల వరకు వెనక్కి నెట్టి ఉండవచ్చని భారత కెప్టెన్ మిథాలీ రాజ్ అభిప్రాయపడ్డారు. మిథాలీ మాట్లాడుతూ, పూర్తి స్థాయి మహిళల ఐపీఎల్ కు మేము కనీసం మూడేళ్ల దూరంలో ఉన్నాము. కానీ ఇప్పుడు ఈ మహమ్మారి కారణంగా మహిళల క్రికెట్ 2 సంవత్సరాలు వెనకబడింది అని చెప్పారు. అయితే, భారత మహిళా జట్టు కోసం ఒక బలమైన క్యాలెండర్ ను రూపొందించడానికి మేము బీసీసీఐ తో చర్చలు జరిపాము, అందువల్ల జట్టు క్రమం తప్పకుండా అభిమానుల ముందు  ఉంటుంది కానీ ఇప్పుడు ఆ అవకాశాలు అన్ని దెబ్బతిన్నాయి. అయితే మేము త్వరగా ఈ దెబ్బ నుండి కోలుకోగలము అని నేను నమ్ముతున్నాము. పూర్తి స్థాయి మహిళల ఐపీఎల్ ఇంకా 2-3 సంవత్సరాల దూరంలో ఉందని నేను భావిస్తున్నాను, కానీ ఈ ఏడాది ఉమెన్స్ ఛాలెంజ్‌లో నాలుగోవ జట్టు ఆడాలని మేము అనుకుంటున్నాము అని తెలిపారు. ఇక చూడాలి మరి ఈ ఏడాది పురుషుల, మహిళల ఐపీఎల్ అసలు జరుగుతుందా... లేదా అనేది.