ఇంగ్లాండ్ తో సిరీస్ కు కెప్టెన్ గా మిథాలీ రాజ్

ఇంగ్లాండ్ తో సిరీస్ కు కెప్టెన్ గా మిథాలీ రాజ్

ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా మిథాలీ రాజ్ ను నియమించారు. 1ఆల్ ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ శనివారం సమావేశమై 5 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ముంబయి వేదికగా ఫిబ్రవరి 22 నుంచి ఇంగ్లాండ్ మహిళల జట్టుతో మిథాలీసేన వన్డే సిరీస్‌లో తలపడనుంది. ఐసీసీ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు వాంఖడే స్టేడియంలో తలపడనున్నాయి. ఇటీవల న్యూజిలాండ్‌ లో పర్యటించిన భారత మహిళల జట్టు మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.