మహెష్ 26 ఇంత సాఫ్ట్ గా ఉందేంటి...

మహెష్ 26 ఇంత సాఫ్ట్ గా ఉందేంటి...

మహేష్ 26 వ సినిమా టైటిల్ ను మహేష్ బాబు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.  సరిలేరు నీకెవ్వరూ అనే టైటిల్ ను ఈ సినిమాకు పెట్టారు.  టైటిల్ వినడానికి బాగుంది. అదే సమయంలో చాలా సాఫ్ట్ గా ఉంది.  మహేష్ టైటిల్స్ ఎప్పుడు పవర్ఫుల్ గా షార్ట్ గా ఉంటాయి.  వెంకటేష్ తో చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మినహా అలాంటి టైటిల్స్ జోలికి మహేష్ వెళ్ళలేదు.  అయితే, కథ పరంగా సినిమాకు కరెక్ట్ గా యాప్ట్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ టైటిల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. 

మహేష్ సరిలేరు నీకెవ్వరూ టైటిల్స్ పై మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది.  అనిల్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.  సినిమాకు ఇదే కరెక్ట్ టైటిల్ అని.. రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారని అంటున్నారు.  హీరో క్యారెక్టర్స్ ను ఎలివేట్ చేస్తూ పక్కా మాస్ సినిమాలు తీసే అనిల్, ఎఫ్ 2 సినిమాతో తన రూట్ ను మార్చి కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. మరి మహేష్ ను అనిల్ ఎలా డీల్ చేస్తాడో చూడాలి.