రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుంది

రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుంది

కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం స్నేహం చేస్తుందని బీజేపీ నేత, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆరోపించారు. విభజన హామీలను ఒక్కోక్కటిగా నెరవేరుస్తుంటే కేంద్రంపై నిందలెస్తున్నారని అన్నారు. తెలుగు ప్రజలను అడ్డం పెట్టుకుని టీడీపీ డ్రామాలాడుతుందని మండిపడ్డారు. కేంద్రం నయాపైస ఇవ్వకుంటే ఇంత అభివృద్ధి ఎలా జరిగిందంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఆధ్వర్యాన అబద్ధాల, అవినీతి పాలన సాగుతుందని ఆరోపించారు. పార్లమెంట్ అవిశ్వాస తీర్మానం చర్చలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అహంకార పూరితంగా వ్యవహరించిందని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అన్నారు.