సీఎం జగన్ కు ఎమ్మెల్యే బాలకృష్ణ లేఖ..!

  సీఎం జగన్ కు ఎమ్మెల్యే బాలకృష్ణ లేఖ..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లేఖ రాసారు. హిందూపురం కేంద్రంగా జిల్లాను  ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. హిందూపురం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని, కర్ణాటక రాజధాని బెంగళూరు కి దగ్గరగా ఉండటంతో పాటు అనువైన స్థలం కూడా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. సీఎం జగన్ తో పాటు ఏపీ సీఎస్ నీలం సాహ్నికి కూడా బాలకృష్ణ లేఖ రాసారు. మరోవైపు మెడికల్ కళాశాల వివాదంపై కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కి లేఖ రాసారు.  హిందూపురం సమీపంలోని మలుగూరు వద్ద మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటుకు హిందూపురం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని తెలిపారు. హిందూపురం లో జనాభా, ఇతర అవసరాల దృష్ట్యా మెడికల్ కళాశాల అవసరం ఉందని బాలకృష్ణ తెలిపారు.