ఎమ్మెల్యే సోదరుడు అరెస్ట్

ఎమ్మెల్యే సోదరుడు అరెస్ట్

అటవీ శాఖ అధికారులపై దాడికి పాల్పడని ఘటనకు సంబంధించి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జడ్పీ వైస్‌ఛైర్మన్‌ కృష్ణారావును పోలీసులు కొద్ది సేపటి క్రితం అరెస్టు చేశారు. ఆయన అనుచరులతోపాటు మొత్తం 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జడ్పీ వైఎస్‌ ఛైర్మన్‌ పదవికి కోనేరు కృష్ణారావు రాజీనామా చేశారు. జడ్పీటీసీ పదవి నుంచి కూడా ఆయన తప్పుకున్నారు. రాజీనామా పత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు పంపించారు.