శ్రీరాముడిని బీజేపీ రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటుంది : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

శ్రీరాముడిని బీజేపీ రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటుంది : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరామున్ని.. బీజేపీ పార్టీ రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటుందని..రామున్ని రాజకీయంలోకి లాగి అపవిత్రం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు ఎమ్మెల్యే చల్లా. అయోధ్య పేరుతో దొంగ బుక్కులు పట్టుకుని చందాలు వసూళ్లు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయోధ్య విరాళాలు ఎక్కడికి పోతున్నాయో చెప్పాలి ? అని నిలదీశారు చల్లా ధర్మారెడ్డి. భద్రాద్రి సీతారాముల వారిది కాదా ?  పటేల్‌ విగ్రహానికి 2900 కోట్లు పెట్టిన మీరు అయోధ్యకు 11 కోట్లు పెట్టలేరా ? అని ప్రశ్నించారు. బీజేపీ కండువా కప్పుకుని.. చందాలు వసూలు చేయడం దారుణమని మండిపడ్డారు. చందాలు వసూలు చేసిన లెక్కలు ప్రజలకు చెప్పాకే.. రేపటి నుంచి తిరగాలన్నారు. చందాల పేరుతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చల్లా ధర్మారెడ్డి. తాను నిజమైన రామ భక్తుడిని అని.. తన స్వగ్రామంలో రామునికి గుడి కట్టించానని పేర్కొన్నారు.