కోడెల కుటుంబంపై సంచలన ఆరోపణలు..!

కోడెల కుటుంబంపై సంచలన ఆరోపణలు..!

నవ్యాంధ్ర శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్, ఆయన కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి... కే ట్యాక్స్ పేరుతో కోడెల కుటుంబం వందల కోట్లు దోచుకుందని ఆరోపించిన ఆయన.. బాధితులంతా తెలుగుదేశం పార్టీకి చెందినవారేనని.. తమ సొంత పార్టీకి చెందిన వారి దగ్గరే కోడెల దోచుకున్నారని విమర్శించారు. ఇక కోడెల ఫ్యామిలీ అనేక భూకబ్జాలకి పాల్పడిందని పేర్కొన్న ఆయన... కాంట్రాక్టర్లు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను దర్జగా దోచుకున్నారని వ్యాఖ్యానించారు. కోడెల ఫ్యామిలీ వ్యవహారం బయటకు రావడంతో బాధితులంతా బయటకు వస్తున్నారన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. కోటప్పకొండ పక్షుల పార్క్ లో పక్షులకు వేసే మేతలోనూ డబ్బులు తినేస్తే ఆ పక్షలు చనిపోయాయంటూ ఫైర్ అయ్యారు. స్పోర్ట్స్ ఈవెంట్స్ నిర్వహించి క్రీడాకారులకి అన్నా క్యాంటీన్‌లో భోజనాలు పెట్టారని మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే.. కోడెల కొడుకు, కూతురు అనేక అరాచకాలకి పాల్పడ్డారు.. బాధితులందరికీ నేను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.