ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగామవ్వాలి

ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగామవ్వాలి

సిద్ధిపేట జిల్లాలో నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్నారు. రంగాదాంపల్లి అమలర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన హరీశ్‌.. అనంతరం రంగనాయ సాగర్‌ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే హరీశ్‌ రావు యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగామవ్వాలని సూచించారు. యోగా చేస్తూ ఆరోగ‍్య సమాజం నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.