వారిలో ఎవరు పోటీ చేసినా గెలిపిస్తాం : జగ్గారెడ్డి

వారిలో ఎవరు పోటీ చేసినా గెలిపిస్తాం : జగ్గారెడ్డి

ప్రియాంక లేదా రాహుల్ గాంధీ మెదక్ నుండి పోటీ చేస్తే గెలిపించుకుంటామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. చిట్ చాట్ లో మాట్లాడిన జగ్గారెడ్డి, మెదక్ పార్లమెంట్ నుంచి వారిద్దరిలో ఒకర్ని పోటీ చేయించే అంశంపై ఏఐసీసీకి కూడా  లేఖ రాస్తానని అన్నారు. దేశ ప్రజల మనసులు చూరగొంటున్న రాహుల్ గాంధీ మంచి వ్యూహకర్త అని జగ్గారెడ్డి కితాబిచ్చారు. కేవలం ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాదు తెలంగాణలో కూడా ప్రియాంక గాంధీ ప్రభావం ఉంటుందని ఆన్నారాయన. తెలంగాణ ఇచ్చిన కుటుంబం మెదక్ నుండి పోటీ చేస్తే.. ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సిఎం కేసీఆర్ సహకరించాలని కోరారు. సీఎల్పీ నేత భట్టికి పూర్తి మద్దతు తెల్పుతున్నామని స్పష్టం చేసిన జగ్గారెడ్డి, భట్టిని పక్కనపెడితే.. రాహుల్‌ను వ్యతిరేకించినట్లేనని  వ్యాఖ్యానించారు.