క్రమశిక్షణ కమిటీకి కోమటిరెడ్డి లేఖ

క్రమశిక్షణ కమిటీకి కోమటిరెడ్డి లేఖ

క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డారంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు పపంపగా... టి.పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌కు లేఖ రాశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నోకాజ్ నోటీసులకు తన లేఖలో వివరణ ఇచ్చిన ఆయన... నేను పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యవహరించలేదని పేర్కొన్నారు. పార్టీ బాగుకోసమే సలహాలు ఇచ్చాను తప్ప.. వేరే ఉద్దేశంలేదన్న ఆయన... గతంలో కూడా మీరు నాకు నోటీసులు ఇచ్చారు.. అప్పుడు మీకు వివరణ కూడా ఇవ్వలేదు..! అంటే మీరు నా అభిప్రాయాలకు ఏకీభవించినట్టే కదా..? అంటూ వివరణ లేఖలో ప్రశ్నలు ఎక్కుపెట్టారు. అప్పుడు తప్పు అనిపించని మీకు.. ఇప్పుడు ఎలా తప్పు అనిపించింది? అని ప్రశ్నించిన కోమటిరెడ్డి... తాను వ్యాఖ్యలు చేసిన తర్వాత మునుగోడు అసెంబ్లీ టికెట్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే, గతంలో నోటీసులకు కనీసం సమాధానం ఇవ్వని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... ఇప్పుడు త్వరలోనే బీజేపీలో చేరబోతున్నానంటూ ప్రకటించిన తర్వాత వివరణ ఎందుకు ఇచ్చారు అనే చర్చ సాగుతోంది.